పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

23


48

కమలనాభా ! నే నీవేగువాఁడనై విన్నపంబు నేయవచ్చితి ; ఏకాంతంబున విన నవధరింపుము, భువిలో శరీరం బనియెడి మాయాపట్టణంబు గలదు. అందు కహంకారం బనియెడి రాజు; చలం బనియెడు ప్రధాని; విషయంబు లనియెడి కరితురంగంబులు; పాపంబు లనియెడి వీరభటులు; కోరిక లనియెడి కాపులు; రతిసుఖంబు లనియెడి ధనధాన్య భండారంబులు గలవు. ఈరీతిఁ గోటలోనివారలు ఆశలనియెడి నిశాసమయంబుల నేమఱి నిదురవోవుచుందురు. జ్ఞానంబనియెడి నీ యూడిగపు దొరతో నన్ను బుద్ధి వైరాగ్య శమదమంబు లనియెడి బలము వెంటఁ గూర్చి యంపితేని ఆకోటగొని యందు ఠాణంబుండి పగవారి నందఱను గెలిచి పట్టితెచ్చి యప్పగించెదం బంపు వెట్టవే; శ్రీ వేంకటేశ్వరా !

49

సుదర్శనధరా ! జీవులునేసిన పుణ్యపాపంబులు చిత్రగుప్తులు వ్రాయుదురట; నామీఁద నేమి వ్రాయుదురో యెఱుంగను. నేఁ జేసిన పుణ్యంబులు మీకు సమర్పించితిని; పాపంబు సేయించిన యింద్రియంబుల మీముందటం బెట్టితి; మనంబు మీకు నప్పగించితి; భక్తి మీకుం గానుకగాఁ బెట్టితి; శ్రీ వైష్ణవుండనై మీదాసుల మఱుంగు సొచ్చితి. అన్నింట నా కొఱంతలు దీర్చుకొంటిని. ఇంక నామీఁదఁ జిత్రగుప్తులు నిలువలు వ్రాయంబని లేదు. ఇందుకు సాక్షియు నీవే; ఎఱుకయు నీవె; విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా !

50

రంగధామా ! నీవు నీటిపైఁ గొండలఁ దేలించిన బలవంతుండవని,క్రోఁతులచేత రాజ్యంబు సేయించిన నేర్పరి వని, రాతికిం బ్రాణంబు లిచ్చిన యుదారుండ వని, కొండ గొడుగుగాఁ బట్టిన సత్త్వ సంప