పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు నెఱుంగ నలవిగాక తిరుమల వరుస వెంటం జని వేంకటాచలం బెక్కి, గరుడ స్తంభంబు చెంత జనులకు నీవొసగు వరంబులు సూచియుఁ, బాపవినాశనంబునఁ దీర్ధంబులాడువారి పాపంబులు నీరై పాఱుటంజూచియు, ఆకొండమీఁదవృశ్చికసర్పాదిజంతువులు నిర్గతవిషంబులగుటం జూచియుఁ జోద్యంబు నొంది యచట నీ మూర్తి దర్శించి తొల్లింటి యజ్ఞానంబు విడిచి సందేహంబులు మాని నీవే యేలిక వనియు నే నీబంట ననియుం దెలిసి శ్రీ వైష్ణవుండ నైతి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !

42

ఉపేంద్రా ! నీవు నాకు దేవరవై నాలోనుండఁగా నే నీదిక్కు సూడక యేకాంతంబని సంసారంబు చేసి బిడ్డలం గంటిని. అదియునుంగాక యేలిక వైన నీవు నన్నుఁ జూచుచుండ బ్రమసి యెవ్వరుం గానరని చేయరాని, పాపంబులు చేసితిని. మఱియు నీవు నాకుఁ దోడవై రక్షకుండవై యుండఁగా మఱచి యొంటి నున్న వేళ నొక్కండనే యని సంశయించి భూతంబులకు వెఱచితిని. క్రమ్మఱ నీవు నా మనంబులోఁ బంచేంద్రియములలో విహరింపఁగా వెఱవక, మందెమేల మని యెంచక, మంచము పై నిద్రించితి. ఒక్కొక్క వేళఁ దలిదండ్రులైన మీ రాత్మభోగంబుల నొసగుచు బాహ్యాంతరములం గాంచుచుండఁగాఁ గొంచించక సిగ్గు విడిచి మలమూత్రంబులు విసర్జించితి. ఎంచి చూచిన నా యపరాధంబు లెన్ని యైనం గలవు; అన్నియును నోర్చుకొనుము. నా తప్పులకుం బ్రాయశ్చిత్తంబుగా దండంబు పెట్టెద; శ్రీ వేంకటేశ్వరా !

43

చక్రపాణీ ! నీ మాయలకు లోనై నేను వ్యసనంబులచేతం జిక్కినప్పుడు నీబంట నని విడిపించుకొనుమీ ! ఆశాపాశంబులు నన్ను నలు వంకలకుం గుదియఁ దీసెనేని ప్రాతవాఁడనని వెనుక వేసికొనుమీ