పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వరవచనములు

15

తప్త శంఖచక్రముద్రలం బరిశుద్దులై, కామక్రోధపశువుల జ్ఞానాగ్నిలో వేల్చి, తులసీయుక్తమైన నీ శ్రీపాదతీర్థసోమపానంబునం బాపంబులు విదల్చి, నీ ప్రసాదమనియెడి పురోడాశంబు నారగించి, యాచార్యోక్తిముఖంబున నీ తిరుమంత్ర యజమాన పాఠంబులు జపియించి, నీకు బ్రీతిగా శ్వేతమృత్తికా శ్రీచూర్ల ధారణంబుఁ జేసి, పద్మాక్ష తులసీమాలికలు పూని, నీపైఁ దలంపుం బెట్టుకొని నీ పూజాయాగంబు నిత్యంబును జేయు వైష్ణవోత్తముల భాగ్యంబు లేమని వర్ణింపవచ్చు? శ్రీ వేంకటేశ్వరా!

31

పద్మనాభా! నీకు మ్రొక్క నెత్తిన కేలి నమస్కారంబు ముంజేతికంకణంబు; నీ లాంఛనంబులైన తిరుమణి పదంబుల జోడు మంగళసూత్రంబు; ఇతరంబుమాని నిన్నే కొల్చుట పాతివ్రత్యధర్మంబు; నీ దాసులసంగతి మెలంగుట కులాచార నియమము; నీపై భక్తినిష్ఠకుంజొచ్చు టుంకువధనం బందుకొనుట; నీదాస్యమే మానంబు; నీ కైంకర్యంబు సేయుట కాపురము సేయుట; నీ మూర్తి సేవించుటే సదానుభవంబు; నీ ముద్రలు ధరియించుటే చక్కఁదనంబు; ఆచార్యోపదేశంబే యావజ్జన్మసంపద; యని నిన్ను భజియించువారలు శ్రీవైష్ణవులు. ఇటువంటి వారలకు నీవు వరదుండ వని వింటిమి; మేము వీరిలోనివారమే. నీ చిత్తంబునఁ బెట్టుమీ; శ్రీ వేంకటేశ్వరా!

32

కోటిసూర్యప్రకాశా! లీలావినోదంబులకు నీవు గడియించుకొనిన ద్రవ్యంబులు లవణేక్షు సురా దధి ఘృత క్షీరాదులు సముద్రంబులై యున్నవి; కాంచన రజత ముఖ్యలోహంబులు పర్వతంబులై యున్నవి; సకలధాన్యంబులు నిచ్చఁ గ్రొత్తపంటలై రాసు లగుచున్నవి; పద్మరాగ వైడూర్య రత్నసంఘంబులు భూగర్భంబున నిక్షేపంబులై యున్నవి;