పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. శ్రీ వేంకటేశ్వర వచనములు . .


22

శ్రీజనార్దనా! శ్రీభూమీ నీళాసమేతా! శంఖ చక్ర గదా ఖడ్గ శార్ ఙ్గకాయుధధరా! చతుర్భుజా! శ్రీకౌస్తుభమణి శ్రీవత్స శోభిత వక్షా! పీతాంబరధరా! మణికిరీట మకరకుండలాభరణా! వైజయంతీ వనమాలాలంకృతా! పుండరీకాక్షా! అనేక బాహూదరశిరః పాణి పాదోరు జంఘావయవా! విశ్వరూపా! అనంతగరుడవిష్వక్సేనాది నాయకా! సనకసనందన సనత్కుమార సనత్సుజాత సల్లాపా! నారదగానప్రియా! నీలమేఘశ్యామలా! చతురాననజనన నాభీసరోజా! గంగానదీ కారణ శ్రీ పాదపద్మా! భక్తవత్సలా! వేదోద్ధారకా! వైకుంఠపురవరాధీశ్వరా! అసురశిక్షకా! అమరరక్షకా! జగన్నివాసా! జయ జయ, నీకు ననంత నమస్కారంబులు సేసెద. అవధారు; శీృ వేంకటేశ్వరా!

23

జేంద్రవరదా! నీవు మాకుం గల వని యొరులం దీవింతుఁగాని యా దీవనఫలము నొసగ శక్తుండనుగాను. నీవు నాయందుఁ బ్రవేశించి యున్నావని మ్రొక్కించుకొందుంగాని రాజసమున మ్రొక్కించు కొన్నవాఁడనుగాను. నీ దాసుండనని పెద్దలలో దొరలుచున్నవాఁడం గానీ నా తపోమహత్త్వంబున నధికుండనని యహంకరించినవాడం గాను. నీవు మనుష్యునిం జేసి ప్రవేశింపఁ బుట్టితింగాని నా స్వతంత్రంబునం బుట్టినవాఁడను గాను. నే నెంత జడుండైన నెన్నివిధంబుల విడువందగునె నన్ను? శీృ వేంకటేశ్వరా!

24

ప్రద్యుమ్నా! నీ పాదంబులు మనంబునఁ దలఁచెదను; వాక్కునం గొంత నుతించెదను; నా చరణంబుల మీకుఁ బ్రదక్షిణంబు వచ్చి చేతులెత్తి మ్రొక్కెదను; నాకుం గలిగిన యుపాయంబు లవియ; కాన