పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

వరంబులకు హానిలేదు. నిన్నుఁ గొలిచినవారి పదవులు ధ్రువపట్టములు. ఇది లోకదృష్టాంతము. నీచరిత్రలు గణుతింప నలవిగావు. మఱియు నితరమార్గంబు లెండమావుల నీళ్ల వంటివి; మిణుంగురుఁబురువుల ప్రకాశము వంటివి; కాకిబేగడలసొమ్మువంటివి; కప్పచిప్పలవెండి వంటివి. ఇట్టి భ్రమలం బొరలక నీశ్రీపాదంబులే గతి యని యున్నవారలు ధన్యులు. శ్రీ వేంకటేశ్వరా!

18

నారాయణా! పుట్టువులు హేయమూల మనంగా నూరక రోయుటేకాని యని యెవ్వరికి నపకారకంబులని తెలియంబడవు. కర్మంబులు ఫలంబు లొసగునని చేయుటకాని యవి మాతో నొడంబడుటలేదు. సంసారభారంబున నూరక జడియుటకాని యది యెవ్వరికి నసహ్యంబని తోఁపదు. మోక్షంబు మంచి దనంగా నాసపడి వెదకుట కాని యది తొల్లి యనుభవించి చూచినది గాదు. నీవు సర్వేశ్వరుండ వనఁగా విని మ్రొక్కుట గాని నిన్ను నింతటివాఁడ వని తెలియ నలవిగాదు. ఏమని విన్నవించెద? నాజ్ఞానం బనఁగా నెట్టిది? తొలిజన్మంబున నామీఁదఁ గటాక్షం బేపాటి పెట్టితివో యీజన్మంబున నీ దాసుండం గాఁ గలిగె, శ్రీవేంకటేశ్వరా!

19

సకలలోకారాధ్యా ! అన్నిచోటుల నుండుదువు గావున మే మెచ్చటనుండి సంచరించి వచ్చినను నీయొద్ద నున్నవారమే; నీవు సకలలోకనాథుండవు గావున నిన్నుం గొలిచిన వారమే; కన్నుల యెదుట నున్న రూపంబులెల్ల నీ శరీరంబు గావున నిన్ను సదా సేవించినవారమే; మాలో నెప్పుడుఁ బాయకుండుదువు గావున నిన్నుం దలంచినవారమే. నేఁగొనియెడి యాహారంబులు నీ విచ్చినవి గావున నీ ప్రసాదోజ్జీవనమే; నేఁజేయుచున్న కృషిగోరక్షణవాణిజ్యాదులు నీ లీల కుపయోగంబులు గావున నవి నీ పూజలే; నన్ను నీవు పుట్టించినవాడవు గావున నీబాము