ఈ పుట ఆమోదించబడ్డది
84
శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము
సారసుదంతా భుజకుముద హార
చారుప్రభాపూర చంద్ర! మేల్కనుము
నేత్రరాగ విశేష నిచితప్రతోష
మిత్రవిందారసోన్మేష ! మేల్కనుము
భద్రానఖాంకుర బాల చంద్రాంక
ముద్రిత భుజతటీమూల ! మేల్కనుము
లక్షణా పరిరంభ లక్ష్మితో దార
వక్షోవిశాల కవాట ! మేల్కనుము
వేడుకఁ బదియాఱు వేలకామినులఁ
గూడిపాయని పెండ్లికొడుక ! మేల్కనుము
కలిత వక్రగ్రాహగంభీర జలధి
వలయిత ద్వారకావాస ! మేల్కనుము
జలదనీల శ్యామ ! జగదభిరామ !
వేలయ మేల్కను మంచు విన్నవించుటయు
వీనులఁ గదిసిన వెలిదమ్మికన్నుఁ
గోనల నమృతంబు గురియ మేల్కాంచి
సరసిజాక్షుఁడు దేవసంఘంబు మీఁద
కరుణాకటాక్ష వీక్షణము నిగుడ్చి
శ్రీవేంకటాచల శిఖర మధ్యమున
సౌవర్ణమణి మయ సౌధంబులోన
పూగచంపక కుంద పున్నాగవకుళ
సాగరంగప్రసూన విరాజమాన