ఈ పుట ఆమోదించబడ్డది
82
శ్రీ వేంకటేశ్వర ప్రభాత స్తవము
'
ఆననంబునఁ దల్లి కఖిలలోకములు
పూని చూపిన యాదపురుష మేల్కనుము
ఖర ధేనుకాసురక్రకచ ! మేల్కనుము
వరగర్వఘనబక వైరి ! మేల్కనుము
చతురాసనుఁడు వత్స సమితి నొంచినను
బ్రతియొనర్చిన పరబ్రహ్మ ! మేల్కనుము
కాళియ ఫణిఫణాంగణ నృత్యరంగ
లాలితచరణవిలాస ! మేల్కనుము
అతులకుబ్ధామనోహరుఁడ ! మేల్కనుము
చతురమాలా కారశరణ ! మేల్కనుము
వనజాక్ష ! యక్రూరవరద ! మేల్కనుము
వినయ వాక్యోద్ధవనినుత ! మేల్కనుము
భుజ విక్రమక్రమ స్ఫూర్తిమై భోజ
గజముఁ జంపిన బాహుగర్వ ! మేల్కనుము
జెట్టిపోరను గిట్టి చీరి చాణూరు
చట్టలువాపిన శౌరి ! మేల్కనుము
కురుసైన్యవిదళనాకుంఠితోత్సాహ
భరితపాండవపక్షపాత ! మేల్కనుము
చండ భారతరణ చాతుర్య ధుర్య
గాండీవి 'సారథ్య కరణ ! మేల్కమము
బల భేది భేదించి పారజాతంబు
నిలకుఁ దెచ్చివ జగదీశ ! మేజ్కు నుము