పుట:Sri-Srinivasa-Ayengar.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు, దక్షిణ భారతమునజన్మించిరి. ఈ మహావ్యక్తికీర్తి అరవదేశమునందేగాక తెలుగుదేశమునందును నితరప్రాంతములందును వ్యాపించియుండెను. ఈ అసమాన వ్యక్తితో సుమారు ఇరువదియైదుసంవత్సరములు అనుచరుడనుగానుండి అనేకసభలకుసు, అనేకరాష్ట్ర అఖిలభారతకాంగ్రెసు సమావేశములకును వెళ్లుభాగ్యము నాకు తటస్థించెను. వీరితోసంభాషించుట హృదయాహ్లాదకరముగ నుండుటయేగాక ఎన్నియో నూతనవిషయములు తెలుసుకొన వీలుకలిగినది. వీరికి పట్టుదల, ధైర్యసాహసములు, ప్రజ్ఞ అపారము. వానిగూర్చి నాకు తెలిసినంతవరకు ప్రపంచమునకు వెల్లడింప ప్రయత్నించెదను. శ్రీగాంధీగారితో భిన్నాభిప్రాయము జనించినపుడు నిర్లక్ష్యముగ తన యభిప్రాయమును వెల్లడించి తానెంతో శ్రమపడిన సంస్థయగు కాంగ్రెసును విడనాడిరి. శ్రీగాంధీగారేగాక ప్రముఖు లెందరో వీరిని మరల కాంగ్రెసునందు చేరుడని అనేకముగా ప్రాధేయ