పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వాస ము


మమ్ముఁ జూచీ చూడకముందే మౌనివరులు
చేరి కుశల సంప్రశ్న ముల్ సేసి పిదప
స్థండిలంబునఁగోరి కూర్చుండఁ బెట్టి
యుబుసుపోకకు మాటాడు చుండిరంత.

అడవి పూలగబ్బు నపహరించి భరించి
కుంటినడకతోడఁ గొంటె గాలి
యొడలి కెక్కి ప్రాకి పొడుగు గడ్డము లూంచు
చుండ నిట్లుపల్కె నొక్క తపసి.


కథకుఁ డొక్కఁడు రేపు సత్కథలఁ జెప్ప
వలయుఁ గావున నిపుడొక్క- ప్రథిత యశుని
నిర్థరించి పౌరౌణిక నిఖిలగాథ
లాలకింప స్వ శ్శ్రేయసమగు నఁటన్న


శౌనక యతి మూర్ధన్యుఁడు
మానిత మహనీయ సూక్తి మాధుర్యముతోఁ
దా నీగతి వచియించెను
మానిన రేణ్యులకు ధర్మమార్గముఁ దెలుపన్,


సూతుఁడు జ్ఞాన యోగపరిశోధిత దివ్యమనోంబుజాత వి ఖ్యాతుఁడు ధర్మశాస్త్రత గర్భ రహస్య విశిష్ట తత్వ ని స్థాతుఁడుగల్గ నొండొకని సాయము హేయము గాకయున్నె యో పూత చరిత్రులార ! మన పుణ్యముచే నతఁడున్ నిచ్చటన్ •

97