పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణ ము


సూతా! సంయము లెల్ల నె మిశవనక్షోణీ తలంబందు వి
ఖ్యాతోదంచిత సత్రయాగ మివుడే కావింపనున్నారు, మ
చేతః ప్రీతిగ రమ్ము పోవుదము విచ్చేయంగ నున్నారటే
పూతాత్ముల్ ఋషి వుంగవుల్ త్రిజగతీవుణ్యాత్ము లెందరో


పెద్దల సేవఁ జేయు తల పెప్పుడ నీ తలఁగల్లుఁ గాన నొం
డుద్ధియు లేనివారు చనుచుండిరి యాడకు వారివద్దనున్
బుద్దులు సేర్వవచ్చు మనప్పువు సార్థకమౌను, లెమ్ము వే
రెద్దియు బల్కకంచు వచియింపఁగ వల్లె యటంచు 'నేనునున్".


పుణ్యుఁడు శౌనకుండు పరిపూత చరిత్రుఁడు వెంటరాఁగఁ గా
రుణ్యముతోడ బాటల నెరుంగుటఁ జొచ్చితి నీలకంఠ లా వ
ణ్యము, సౌరభ ప్రసవరేణ్య మగణ్యము నైమిశాఖ్య కా
రణ్యవరేణ్యమున్ మునిశరణ్యము కోర్కెలు సందడింపఁగన్


పొడుపుగుబ్బలిమీఁదఁ బొడ తేర జూబిల్లి
              పండు వెన్నెల కాయుచుండె నపుడు,
పండు వెన్నెలఁజూచీ పగలంచు భ్రమియించి
             పర భృతానీకంబు పాడ సాగే
పర భృతగానంబు సమ్మగఁ బలవించి
            బ్రహ్మచారి యులికి పడుచునుండె:
బ్రహ్మచారిని జూచి బై రాగు లేందరో
             ముసి ముసి నవ్వులో మున్గియుండ


96