పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమా శ్వాస ము


గంగా పూత జలాభిషేకము నశోకస్రగ్విలాసంబునుమ్
భృంగీ గీత వినోదము బిక వచః పీయూష మాధుర్యమున్
శృంగారాబ్ద మయూఖ సద్గరజినుల్ చెందమ్మి కొందవి మీ
సంగాతంబును మా పొలంబుడుఁగ వారసిద్ధి చేకూరు నే?


పరమపావన గాంగ పాథస్సమూహంబు
           పుష్కరిణీ కూప పుష్కరంబు
కలకంఠ శారికా కాకలీ రావంబు
            కర్ణ వుటో దీర్ల కలకలంబు
పై కొను వుప్పొళ్ళ వలిగాడ్పు తెమ్మెరల్
          తీరని పెడగబ్బు మారుతంబు
తోటిపోటుల గొట్ల దోరగిల్లిన పండ్లు


కొంటె జబ్బులు దెచ్చు వంటకములు
సరిసమాసములోక్కో! యే సరణి నేని
యెరిగి యొరిగి నే నేల యుపేక్షసేతు ?
సడవిలోనున్న మునిపల్లె విడచి పెట్టి
పొట్టకూటికిఁ గోరాడు పట్టణంబు.
ముక్తిదాయకు లై న మిమ్ములను బాసి
నవ్య విజ్ఞాన సంపాదనమ్ము రోసి
యెరుగ యేడాటమ్మునందు నేనేమి చేసి
యెరుగ నేర్తు ధర్మమ్ముల నెవని డాసి !


91