పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


ఒజ్జలు మీరుగదా మీ.
యజ్ఞుల పైఁ బడినవాఁడ నజ్జము గాఁగన్
ముజ్జగములయందలి వి
ద్వజ్జనము నుతించు ధర్మ పథమును జెవుఁడీ.


ఆగతా నాగత విదులరైన మీదు
దర్శనముఁ జేసీ మీచేతఁ దథ్య మెరిగి
యవల లోకమ్మునకుఁ దెల్పునట్టి వాంఛ
సరుగుదెంచితీ నిటకుఁ గాఱడవిఁ దాటి.


అన్నంతనే నామాటలు
విన్నంతనే సంభమంబు విక్కుచు నుండన్
విన్న నువున ముని యని యెను
బన్నీ కతో సుప్రసన్న భావముతోడన్,


ఓ'యన్న గంగలో నూయల లూగెడి
కొదమ రాయంచ లూఁకొట్టు చుండ
సమిధలు గొని తేరఁ జనినచో వన్యమృ
గావళి తోడు నీడగుచునుండు
గానంబు సేయంగ గమకింప మైన గో
ర్వంకలు నీ సహపాఠు లగును
నిదురించు నిను లేప నీడోద్భవ చయంబు
నీ వందిమాగధ నికర మగును.


89