పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


శుక పర బ్రహ్మ మొకచోట శుద్ద జడుఁడు
వేరె యొకచోట నంసారి బిడ్డతండ్రి
యన్నీ కథలీ పురాణము లందే కలవు
పిట్టకథలకు నివి యెల్లఁ బుట్టినిండ్లు,


ఒకయెడ గుణకర్మంబులె
ప్రకృతము వర్ణ వ్యవస్థ బాల్పుచ్చెడి 'వే
రొకక యెడ జన్మము మాత్రమే
ప్రకటపఱచుఁ 'బొమ్మనును బురాణము లనఘా !


వ్యాసుడే పురాణముల వ్రాసిన నిట్టివి సంభవించు నే?
వ్యానుఁడువ్రాయ లేదు ప్రతిభాత్యుఁడుసూతుఁడు చెప్పులేఁదికన్
మాసర మైన యీసుగల మానిసి మీరలు చెప్పినట్టుగా
వ్రాసెనటంచుఁ జెప్పెద రబద్దమొ 'బద్దమొ లోకు లిప్పుడున్


జాతి మాత్రోప జీవులు నీతి దప్పి
సడ్డఁ జేయక స్వోత్కర్ష జాటుకొఱకు
వ్రాసి రష్టాదశ పురాణవర్గ మను వ
దంతి ప్రజలలో నొకటి యుత్పన్నమయ్యే,


కొందఱు ప్రక్షిప్తంబులఁ
బొందించి యనేకగతులఁ బులు మానిసులై
యిందనుక మోసపుచ్చిరి
యండరు నిజమెఱగరాని దయ్యె మహాత్మా


88