పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


అంబుధి సప్తకం బాపోశనముఁ జేసె
             నొక్కరుండని చెప్పు నొక్కకథను
సర్వభూచక్రంబుఁ జాపచుట్టఁగఁ జుట్టె
            నొక్క-రుండని చెప్పు నొక్క-కథను
సప్తాశ్వు జాయకై సాసఁబబైను బట్టి
           యొక్కరుండని చెప్పు నొక్కకథను
కొండ కై యెగిరెడీ కొండ రెక్కలు గూల్చె
            నొక్కరుండని చెప్పు నొక్క కథను

క్రోతి కొండముచ్చులకును గొండలకును
మానవులు పుట్టిటరని చెప్పు మాయమాట!
లన్నీ కథ లీ ఫురాణము లందే కలవు
పిట్టకథలకు నివియెల్లఁ బుట్టినిండ్లు

పాథోజనాభుండు భగవంతుఁ డొకచోట
            నొక చోట స్త్రైణ శాపోప హతుఁడు
అళి కాక్షు డద్వితీయబ్రహ్మ మొకచోట
            నొక చోట ఋషిపత్నులకు విటుండు
అబ్జగర్భుండు స్వయంభువౌ నొకచోట
            నొక చోట శత్రు పాదోపహతుఁడు
దేవకీపుత్రుఁ డింద్రియ జేత యొక చోట
            నోక చోట జారపాళికి గురుండు


87