పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రా ణ ము


చెప్పితినటంచు. వంచకుల్ చెప్పుచుండ
భేరి మోనమటంచు భావింప లేక
నమ్మి చెడుచున్న వారు లోకము నందు
దానఁ గల్గఁగాఁ జొచ్చె సంతాపభరము.


ఎట్టుల నా పేరిట భువి
బుట్టించు మహోపకారముం బాపికొనినన్
ధట్టుఁడ నౌదునో యని యె
పట్టునఁ దలపోయుచుందుఁ బాయని చింతన్,


పుక్కిటి గాధల నన్నిటి
నొకటిగాఁ జేర్చి పెట్టి యుంచిన మాత్రన్
'మిక్కిలి మతముం దెల్పేడి.
చక్కటిగల గ్రంథమానే చర్చించినచో ?

నా పేరన్ వెలయించి నా మెడకు సంటన్ గట్టి తద్గ్రంథముల్
నాపై నేరము మోపఁగాఁదలఁచయన్యాయంబు న్యాయంబుగాఁ
బాపంబున్ నుకృతంబు గోగ రచియింప జాలినా రెవ్వరో
నాపైఁ బెట్టినయట్టి యీయగడుమాన్పంగాఁ బ్రయత్నించెదన్,


అనిన యనంతరంబు నే నిట్లని విన్నవించుకొంటి

సకల పురాణముల్ చదివి సంగతులన్నియు నే గ్రహింపఁగా
వికలతఁ జెందె నా మనసు నేయి విధమ్ముల శ్రద్దతో బుధ
ప్రకరము నడ్గి యందలి పరస్పర ఘోరవిరుద్దగాథలన్
నికరముగా గ్రహింపఁగను నేరకపోయితి మౌనిచంద్రమా!

86