పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమా శ్వాస ము


శ్రద్ధాభ క్తులఁ బాదపద్మముల మస్తంబుంచియుంట్టినన్
బుద్ధితో భముఁ బొందకుండుమని సంబోధించి దీవించి నీ
విద్ధాత్రీస్థలికిన్ మదర్థమయి యిట్లే తెంచు వృత్తాంతమున్
బుద్ధింజూచి గ్రహించితిన్ మును పెయామూలంబుగానర్భకా!


వ్యాసభట్టాట్టారకుఁడు మొన్న వచ్చి చెప్పె
శిష్యుఁ డొకఁడు విద్యార్థి చేరఁగలఁడు
వాని ధర్మసం దేహము ల్యాపి పంపు
మఖిల లోక కల్యాణ మగును దాన.

అంచు వచియించి నను గు స్తరించి నిమిరి
మీను నికటాననస్థునిగా నొనర్చి
యింబు మీరంగ శరదంబు దంబు డంబు
సనుకరించునట్టుల నిట్టు లనియె మౌని,

సవన దీక్షాతంత్ర సమయంబునందున
              శౌనకాది మునీశ సంచయంబు
ప్రొద్దు రవ్వంతైనఁ బోకుండె ధర్మముల్
            విన్పింపుమని సన్ను వేడుటయును
చిన్న తనంబున శిష్యుండనై వ్యాసు
             సన్నిధిఁ జదివిన చదువులెల్ల
ధర్మ సంస్థాపనార్థము సంగ్రధించి పు
           రాణ సమూహంబుఁ బ్రకట పఱచి

85