పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వా న ము


ఇట్లభిరామంబయిన నావనసీమ దరియంజొచ్చి పోవు నెడ---
పర్ణ కుటీర మొండు సుమ భారవుటీరము మాటునుండి సం
పూర్ణముగాక కంటఁబడె ముందుగ సుస్వర సంయుతంబులై
కర్ణములం బడెన్ శుక పిక ప్రకర స్వనముల్ సదాపతత్
పర్ణ సమూహ సంకలిత పద్ధతిఁ బోవఁగఁబోవ సంతటన్


యుగములగా జేసి యుంచిన యాకులు
చివికి జీర్ణముగాఁగఁ జేదలువట్టి
ఆలనపాలన యది లేమి ముంగిటఁ .
గారాకు లిట్టట్టు కదలుచుండ
అదలించుటకు లేమి నడవిపందులు చొచ్చి
పెల్లగించుచు నుండఁ బెరటి చెట్లు
పై బరామర్శించు వారలుండమిచేత

గోడల మన్నెల్లఁ గూలుచుండ
సారవంతము లైన యోషధులు గల్గి
వీరియఁ బూచిన తీపల విరివి గల్లి
భయము భక్తి గొల్పెడు నీట్టి పర్ణశాల
మౌనిపాసయోగ్యంబగు దానిఁగంటి.

దట్టముగాఁ బెటీగిన కస
వీట్టట్టుగఁ ద్రోసిపుచ్చి మేగజచిన పెన్
గుట్టల మెట్టెడి మార్గము
బట్టి చనితిఁ బర్లశాల వాకిలి కంతన్.


83