పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా స్వా స ము


వానిఁ దొలఁగించుకొన నెంచి వచ్చినాఁడ
సూతు దర్శించు వాంఛమై శుభగచరిత !
గ్రామమో ! యంగలూరు నేఁ గమ్మకులుఁడల
ద్రిపుర నేని రామస్వామి దెల్పుచుంటి.



నన్నా ముని మూర్ధన్యుని
నన్నిధికిం దోడుకొనుచుఁ జన వేడెద నా
విన్నప మాలించుఁడి యా
పన్ను నిఁ గౌపాడునట్టి పని మీదే కదా,


అనిన యనంతరమ్మున ప్రియమ్మున రమ్మని చెప్పి తోడుతోఁ జనియెను దారిఁ జూపుచుఁ బ్రశస్తమనోహర సౌర భాఢ్య పు ష్పనివహ రంజ దత్యధిక వంజుల మంజుల కుంజ పుంజ సం జనిత పధా వర్ధ పరిసర్పిత ధామకు నొక్క సీమకున్.


నృత్యంబుచేఁ జొక్కు నీలకంఠముల పై
              గోడె త్రాచులు నడయాడుచుండె
బాలెంత త్రోల్పులుల్ పాల్చేప బతిమాలి
              యిర్రిజపిల్లలకు జన్ని చ్చుచుండె
ధమ సీంగవుఁ బిండు గున్న టేన్గుల నెక్కి
             యటిట్లు పాతర లాడుచుండె
కాడు బీజాలముల్ బాడుగాఁ గాపాడ
             నాఖువుల్ పింపిళ్ళ నాడుచుండె

81