పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా న ము


విన సొంపు మాటలఁ బిలిచి పాడెడు నట్టి
యున్మత శారిక లొసఁగు సుఖము
బీరెండ నీరెండఁ బెడఁద్రోసి నవకంపు
సహకార వృక్ష మొసంగు సుఖము


బడలికను బాపి యానంద పదవి నొసఁగఁ
బడిన కడగండ్ల మఱపింప భావీ నుఖము
తలపులు భాఱనొకరీతిఁ దనివిఁ జెంది
గాఢ సుప్తిని బొందితిఁ గన్ను మూసి,


పథికాయాసము చేత డస్సిన ననున్ బాటించి లే గాడ్పుల
త్యధిక శ్రాంతతఁ బాపి నిద్రగనుమయ్యా! యంచు జోకొట్టఁగా
బృధులానందముతోడ మైమఱచి హాయిం జెంది నిద్రించితిన్
వ్యధవో, బాల రసాలసాల నిబిడప్యాకీర్ణ సచ్ఛాయలో.


నెక్కొని యెంత కాలమిటు నిద్దురఁబోతినొ లేచి చూచుడున్
వక్కు తపోధనుం డొకఁడు ప్రక్కను నిల్వఁగ సంభ్రపంబుతో
గ్రక్కున లేచి యామునిని గాంచి నమస్కృతిఁ జేసి యూదరం
బెక్కుడుగాఁ దోడంగ మదభీష్టము దీరునటంచు నెంచితిన్

.
శైశవము నుండి బాధించు సంశయముల
నెల్ల మూలముట్టుగఁ బాపి యిపుడు సన్ను
నుద్దరింపంగ వచ్చిన సిద్దుఁడనుచు
లోన తలపోసి యిట్లంటి వానితోడ


79