పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప థ మా శ్వాస ము

దుర్బర నిథామసమయం బగుటయు, నడిమింటఁ జండాశుండు నిప్పులం జెరుగుటయు, ఝురీసమానరయంబున ఘర్మజలంబు మైనుండి దిగజాజుటయు, నడువ నేరక యెట్టెట్టులో తడబడుచు, నడుగులిడుచు, మార్గము దుర్గమంబగుటఁ గార్యంబు దుస్సాధంబని, యెడదకుఁదోఁప, నున్న జవసత్వం బులు సంక్షింణీంప, నెట్ట కేలడు ఖిన్నుండనై పథశ్రమంబున డస్ని నిట్టూర్పు వుచ్చుచుండ---------

మంజు సౌరభసిక్తష మంద మందానిల
              సంచయ 'మెదు రేగు దెం చె' సంత
ఉత్సాహ రభసాంచ దుడ్డీన పరతంత్ర
             పక్షి సంఘంబు కన్పట్టె సంత
వివిధ లతాగుల్మ వీసరసమావృత
             వృక్ష రాజములు గాన్పించే నంత
నానా శకుంత సంతాన సమాకుల
              స్వనము లొక్కటిగ విన్బడియె నంత


నడచి పోవంగఁ గ్రమముగా నాకు నవుడు
చివురు జొంపుల్ “కొమ్మల చెలువు. నింప
గొనలు మీరెడి లేమావి గున్న క్రింద
బండితిని తెరవాసంటుబుం బఱచి కొనుచు.'


77