పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పు రా ణ ము


పిల్లనగ్రోవి మేను మరపించెడు పాటలు పాడుచుండ, వ్రే
పల్లియ గొల్లపిల్లలు "సెబాసని చిందులు ద్రొక్కుచుండ, మా
నల్లని దొంగ దొంగ సవుసన్ గిలిగింతలు పెట్టి, గోపికా
పల్లవ పాణులం గలిసి పాడిన పూఁబొదరిండ్లఁజూచితిన్.

రామునిగూడి గోపకులు రాఁ బశువర్గముతోఁ గిలారు లై
యోమటిపంటికావడుల నొప్పుగఁ దాలిచి శై శవంబునన్
శ్యామల పర్ణుడైన జలజాక్షుడు ప్రొద్దులు పుచ్చినట్టి యా
యమున సైకతంబు లీవియంచుఁ దలంచితి సంతసించితిన్,

క్షమతో నెర్రని యొండలో యమున దాఁకాకి గోవులందోలితా
యమునాతీర తమాలవృకముల ఛాయన్ నిల్చి కెంగేల వం
శముఁ గీలించుచుఁ బాటఁబాడుచును గోసంతానమున్ నీటికో
సము పోనీయని కృష్ణు బేరజము నశ్రాంతంబు లో నించితినిన్.

నిరంతర శ్రీకృష్ణపాదపొధోజూత పక్షాళన పవిత్రీకృతంబులగనిరోదక లబులఁ
గృతస్నానుండనై వచ్చిన కార్వంబు' 'వేగిరపెట్టుచుండ,"'వెండియు గంగాతీరంబుఁ జే
సూతర్షి సందర్శనాభిలాషంబునఁ బోవఁదోడరగితి

కాయలు దుంపలుందినుచుఁ గష్టము లోర్చుచు గోన్ని రోజులా
చాయనే పోవుచుండగఁ గృశత్వముఁ బొందె శరీర యష్టి, యే
మా యెనో దార్డ్యమే నెరుంగ నైతిని గాళ్లు వడంక సాగే, నా
కాయతి తోఁచదయ్యే నిఁక నట్టు లె పోయితి నూగిసలాడుచున్,


76