పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాయణము

గురుజనపదాంబుజ నిబద్ధ పరమభక్తి
నురుచిరామల వృత్త సంశుద్ద చరిత
యతివమిన్న సీతారత్న మనఁగ నొప్పి
నెల సె విద్యా కుటుంబమే వినుతి కెక్కి

పుత్రులలోనఁ గనిష్ఠుఁడ
విత్రగణసమావృతుఁడ సమిద్దపలండన్
జిత్రప్రబంధ దక్షుడ
సూత్రించెద ధర్మకోటి సూతుని దయచే,


మహిళాధర్మవిశిష్ట వృత్తయయి కామ్య వ్రాత సంధాత్రియై
విహీతాలాప కలాకలాపమయి సద్విద్యావతీభూష యై
రహీ నొప్పారిన వున్న మాంబ సుదతీ ప్రాలంబముక్తామణిన్
గృహిణింగాఁగొని సంతతింగని ముదం బిర్రింకఁగోల్పోయితిన్ .

చెదరని ముంగురుల్ రసము చిప్పిలు తీయని తేటమాటలున్
వదలనీ ప్రేమబంధమును వల్లనీ చల్లని బుల్లి సవ్వులున్
గుదురని జంకుచూపు గమి గూపులు గట్టిగా నా మనస్సులో
మెదలుచునుండెఁగా ప్రతీని మేషము మత్కులకాంత నేఁటిన్

 ,

 

ఉ ప క్ర మ ణి క



క కవుల స్వాతంత్ర్యమో ! మంటఁ గలిసిపోయె
బొట్టకూటికి వరువట్లు ఫుట్టినప్పుడే
యడ్డమైన దేవురుట్టు నాశ్రయించి
భయము లేకుండఁ గవు లెట్లు వ్రాయఁగలరు ?

64