పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వా స ము


ఎన్ని పుట్టువుల్ దొల్లి నే నెత్తినానో
యేరుక లేక యున్న దదృష్ట గరిమచేత
సదియె కల్గిసఁ దలిదండ్రు లందఱకును
వట్టిపోవుదు దండముల్ పెట్ట లేక,


అలకలుదీర్చి కొంటెతన ‘మాట్టె’ యొనర్పఁగఁబోకుమంచు నా
యలుకలు దీర్చి చెప్పి మనసారఁగ సాఁకుచు బద్దరాగులై
కలఁకలు లేక వర్థిలిన గణ్యుల నా తలిదండ్రులన్ దనూ
పులకలుగా నుతించెదను బుణ్యులఁ జల్మయ రామమాంబలన్


మాలదాసరి నోట మహిమభూసురునోట
        నొకరీతి మాటాడి యొప్పినావు
మాలవాడల బాట మహీతభూసురు పేట
        నొక రీతిగఁ జిందుఁ ద్రోక్కినావు
మాల గేస్తుని యింట మహీతభూసురు నింట
        నోక రీతిఁ బదముల నుంచినావు
మాల పెద్దల చెవి మహిమభూసురు చెవి
        నోకరీతి సామెత లూదినావు

కన్న బిడ్డలదెస నొక్క కనికరంబె
చూసి యెల్ల వారికి దారి చూపినావు
తల్లి ! నీమాట, నీపాటఁ దలఁచుకొన్న
జలదరించుచు మే నెల్లఁ బులకరించు.


55