పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


విభుఁ డొకఁడు చేయునంట పై పెత్తనంబు !
కర్మ మొకఁడు సంసార చక్రంబుఁ ద్రిప్పు
సంట !! ద్వంద్వ ప్రభుత్వ ముం దమర లేదే?
ఎంతకాలంబు సాగునో యిట్టిచిట్ట !

ప్రతిసర్గంబుఁ దృణీకరించి మును విశ్వామిత్రుఁడున్ సృష్టికిం
బ్రతి సృష్టిం బొనరించెనందు రది యబ్రంబౌనా? విప్రుల్ ప్రజా
పకి సమ్మోమును దండ కేలు తొడలు బాదంబులున్ బుద్ధిని
హ్ను చే యోనిమయంబుఁ జేసిరను లోకో క్తిన్ విచారించినన్.


గుడులలోనికి దేవుని కొల్వుకోఱకు
నరుగుచున్న యద్విజుఁ గన్నుఁ డెఱచి చూచి
దేవుఁ డూరకుండును భూమి దేవుఁ డూర '.
కుండఁడు దన పుట్టి మునుఁగుచున్న మాడ్కి..


దక్షిణాప్రికాయందు నిగ్గయులు తెల్ల
వారు భారతీయులఁ బెట్టు పాట్లుఁగాచి
గోల్లుమని యేడ్చు నెంతో గగ్గోలుపడుచు
బనవుచుండును నీనాఁటి బ్రాహ్మణుండు.


కాని తానుమాత్రమొ యంటరాని వాండ్రు
ముట్టరా దూళ్ళను బ్రవేశ పెట్టరాదు,
పొమ్మనుచునుండు మాలల బోధపడదు
తండ్రి ! నేటి బాహ్మణుని చిత్తవృత్తి .


54