పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

వీరి పాల్వడీ నే మొజు పెట్టుకొన్న
జెంతకును జేరి నా గోడుఁ జెప్పి కొన్న
నార్తు రా ? తీర్తు రా ? యడీయాసగాక
యిట్టివారికి జోతలు పెట్టు బేల !

ఏది చరాచరంబయిన సృష్టికి సర్వము మూల కారణం
బేది మునీశ్వర ప్రతతి లేని యగోచర మైన దొడ్డ వె
ల్గేది లయాంతమందయిన నించుక వైకృతమందకుండు, నే
శాదృశ నిత్య సత్య పరతత్వ మహత్వము నాశ్రయిం చెదన్

భారతభూతధాత్రితలభాగము సర్వము సొంత యిల్లుగా
నారసి సర్వభూతములయందు సమత్వము విజ్జి రాల్చి సే
వారమణీయు భూతదయ వర్ధిలఁ జేసి ప్రపంచమందుఁ బెం
పారిన బుద్ద దేవుని పదాబ్జము లౌఁదలఁ దాల్చు టోప్ప దే?

శివుని యాజ్నలేనిదే చలిచీమ యైనఁ
గుట్టఁబోదని బుధులాడు గుట్టెరంగి
వలదు నాజోలి కేమి రా వలదటంచు
శివునకును మొక్కు జెల్లింతుఁ జేతు లెత్తి,


ముడుపు గనఁగొని సమ్మోదపడరు
వేఁట తలఁజూచి కానీ మోమోటపడరు
పోతురాజాదు లే నెట్టు పూజ సేతు
లంచగొండితనమ్ము కాన్పించుచుండ ?

55