పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలియుగ మేది?


కార్యకలాపమంతయు నీవిధముగ సంస్కరింపఁబడుట యుత్త మో త్తమము, పూర్వమొకప్పుడు అంగి లేయుల వివాహాది శుభ కార్యముల సందర్భమునందు, అంత్యకర్మముల విష యమునను జెప్పఁబడు మంత్రములన్నియు లేటిన్" భాష యందుండెను. పాకృత జనంబునకుఁ దస్మంత్రార్థ ము దురవగాహముగా నుండుటచే ఇంగ్లీషుభాషకుఁ బరివర్తనముఁ జేయఁబడెను. తన్మూలముగఁ బ్రజలు తాము చెప్పునది యేమో, మంత్రార్థ మేమో గ్రహింపఁగల్గిన వారైరి. భావ మెరుంగక మంత్రోచ్చారణముఁ గావించు ఫక్కికన్నను నిది యు త్తమము కాదా?


ప్రజ లెంతదనుక భావము గుర్తెరుంగక, యర్థము గ్రహింపక, శబ్దజాలమునకు గౌరవము చూపింతురో, యంత దనుక పురోవృద్ది పురాయింపదు. ఇన్ని వేల సంవత్సరములు కడచన్నను ద్విజేతరులకు సామాన్యధర్మములతోఁ గాలక్షేషముఁ జేయు యోగ్యత . కలుగ నేరదయ్యెను, స్మృతు లుదార భావమును జూసింపఁజూలవయ్యెను. హిందూ ప్రభు వులు ధైర్యసాహసములు గొంటువడుటచే దాస్యనిగళ సందా నితులై ప్రజాసామాన్యమునకు విముక్తిమార్గముఁ జూపింప లేకపోయిరి. ఇంతియేకాక యవరోధములు కల్పించిరి. తుదకు విదేశీయ ప్రభువుల కాలములో విముక్తి మార్గము లభించు చున్నది. ఈ పరిణామ , మెంతచిత్రము ! స్వదేశీసభువుల”


46