పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ధర్మ జు రాజసూయ యు నిరంతర ఘోర సంగ్రామవ్యాపారసంతుభిత మన సుండై శ్రీకృషుండొకనాఁడేకాంతంబున, నవరత్న స్థగిత కుడ్యపరిభ్రాజమాన నిజసౌధాభ్యంతర చంద్రశాలలో, సాంద్ర చంద్రమరీచి జాలంబు హృదయాహ్లాదంబు కలుగఁజేయుచుండ నెమ్మదిఁ గూర్చుండి యిట్లు తలపోయసాఁగెను మురనరకహంసగీచికళ బరభూవరకంసముఖం పడనపరులన్ బొరిగోనీతి నను బెకానీ యెఱుగనయితిఁ గంటినిండ నెన్న (డునిద్రన్ ఒకమూల మాగధుం డూర్జిత సత్వుఁడై దండెత్తిపైఁడఁ దలఁచుచుండ ఒకవంక శిశుపాలుఁ డుద్బటారభటీతోఁ 'గోలాహలముగజేయగ గొంకకుండ ఒక చెంప పౌండ్రకుం డుత్సాహవంతుఁడై డెస్పరంబుగ ముట్టడింపనుండ ఒకప్రక్క సాల్వుండు వికటాట్టహాసియై కై లాటములు పెట్టఁ గదలుచుండ 90