పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తొలి పలుకు అతికపటియై కుని నర్గరథునిగా నీరూపించేను. విజముగఁ గర్ణుని నిరసించి, నిరుత్సాహుని జేయు తలంపే లేనియెడల, గర్ణుని నతిరథ శ్రేష్టునిగాఁజెప్పి, వానీకింగల్గిన శాపాదులచే నిర్వీర్యుఁ డగుటచేఁ జేయఁదగినంత యుధ్ధము జేయఁ జాలడవి చెప్పవలసి యుండు. ఎఱిఁగి యెఱిఁగియే పాండవులకుఁ దోడ్పడ నెంచి యీ పద్దతి నవలం బించెను. ఆంప నెఱ్ఱపై భీష్ముండు పడియుండఁగా జూచుటకునై కర్ణుఁడు వెళ్ళియున్నప్పు డిరువురకు జరిగిన సంభాషణము జూడుఁడు. రాధ లిరువురున్నట్లు పురాణాంతరములయందుఁ జెప్పఁబడి యున్నది. ఒక రాధ నందుని చెల్లెలు. కృష్ణుని మేనయ త్త. రెండవ రాధ కృష్ణుని సయ్యాటక క్షే; కీలారులందలి చెలిమికత్తె. ఈ రాధయే మహా భక్తురాలనియుఁ గృష్ణుని పరతత్వమహత్వముఁ గని పెట్టిన జాడ్యనియు భక్తులచే వర్జింపఁబడినది. నామసామ్యములబెట్టి యొడలేటు గవి భక్త కోటిచే నిరువురు నొక్కరుగాఁ జేయఁబడిరి. ఇట్టిది యింకొక యుదా హరణ మీత్తుము. చంద్రవంశమున దశరథుండను రాజోకండుకలఁడు. ఈతనికి శాంతీయను కుమార్తె కలదు. ఈయమనే ఋగ్యశృంగునికిచ్చీ పెండ్లి(జేసిరి. సూర్యవంశమున శ్రీరాముని జనకుఁడయిన దశరథుఁడు కలఁడు. మతిమాలిన భక్తులు నీరువురను నొకటి ఁజేసిరి. శాంతను సీత యాడంబిడ్డను జేసిరి. ఆడువారి పాటలలోవి కెక్కించిరి. ఇట్టి ప్రమాదము లెన్నెన్ని కలవో యెవ్వడెలుంగును ? ధృష్టద్యుమ్నుడు. భారతము దీనిని శ్వేతజాతుండనియు, నయోనిజు (డనియు వచించుచున్నది. ఆయోనిజులు శ్వేతాంగులే. ఈ యయోనిజల చిర కాలమునకుఁ బూర్వము గ్రీకులయందు నొక తెగగానుంది. అయో "నియన్ సముద్రమనియు, సయోనియన్ దీవులనియు వీరి పేర నేటికిని సుప్రసిద్ధములై యున్నవి. కావున భారతవర్షమునకు ధృష్టద్యుమ్నుఁడు దత్తపుత్రుడని యూహించు చుంటిమి.