పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజ్యతృష్ణచే విలవద్విరోధము సంపాదించుకొన్న వారంత్యకాలమును విరుపద్రవముగమ, సుఖముగను గడవ నేర్తురా ? | భారతకాలమునాటికి సాంఘిక పరిస్థితులు చాలక దొజుమాయై నవి అనులోమ వివాహములు విశంకటముగా జరుగుచుండెను. ఒక నిదర్శ నము జూపింతుము. చంద్రవంశ క్షత్రియుఁడయిన ముద్దలనీ సంతా నము బ్రాహ్మణులై 8. బ్రాహ్మణులేకాదు. నాలుకులములవారై రని భాగవ "తము చాటుచున్నది. నేఁటికిని ముద్దల గోత్రజులు బ్రాహ్మణులయందుఁ గలరు. ముద్దలుని పుత్రుఁడైన దివోదాసుని వంశమునందు ద్రుపదుఁడు జన్మించి క్షత్రియుఁడుగనే యుండెను. ముద్దబని కుమార్తెయయిన ఆహల్యవంశమందుఁ గృపాచార్యుఁడు పట్టి బ్రాహ్మణుఁడయ్యెము, అహల్య గౌతముఁడను బ్రాహ్మణుని బెండ్లియాడి బ్రాహ్మణ పంతావ మును గన్నది. తేలినసంగతి యేమి ! కృపాచార్యునకుఁ దల్లి వైపు చుట్టముల పాంచాలురు. కృపాచార్యుని చెల్లెలయిన కృషి ద్రోణా చార్యునిఁ బరిణయమై యశ్వత్థామను గాంచినది. ఒక్కవంశమునందు బట్టిన పాంచాలురకు రాజ్యముండి తనకు లేదనియే కాఁబోలు నశ్వత్థా మకుఁ బాంబౌలర పై నంత దురాగ్రహము. బ్రాహ్మణండయ్యు క్షత్రి యత్వము బూనుట కదియే కారణము. దీని ఫలితమే కాఁటోలు నతని హృదయకార్కశ్యముగూడ. చదువరులకు సుకరంబుగ నుండుటకై ద్రుపద కృపాచార్యుల వంశ మిటఁ దొందుపఱచుచున్నాము.