పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాపర ము


ద్వాపరమున నూతనధర్మపీడలు వెలువడినవి. రాజ్య తృష్ణ విపరీతముగఁ బెంపొందినది. శంతనుఁడు జ్యేష్ట బ్రాత యయిన దేవాపీనీ రాజ్యభ్రష్టునిగావించి, యడవులకంపి తాను రాజయ్యను. వీని సంతతి యైన కురుపాండవులు కూర్చుండనొల్లక పొళ్ళు కుదురక తాము కోట్టుకొని చచ్చుట యేగాక భారతఖండమునంతయు ర క్త ప్లావితమును జేసి, భారత దేశమున దరిద్ర దేవతను దాండవింపఁ జేసిరి. ధరణీ రాజ్య మీతరులకుఁ జేరునేమో యను చింతాశల్వముచే గళత్రము లను బరులవద్దకంపి సంతానమును బడయుటకు వెనుదీయ రైరి. [1]* 'బహుపతిత్వము చరమదశయందుండెను. గోమాంసభక్షణము మానఁబడెను. గోమేధము, ' సర మేధములు లుప్తముల య్యెను. అశ్వ మేధము మాత్రము సకలు సాగు చుండెను. ఆశ్వమాంసభ త ణము నేఁడు జర్శనులయందు స్నది. సురాపానము వెనుకకు మరలినట్లు కన్పడదు. బల రాముఁడు సురాపాన ప్రియుఁడు. వీనికి సభౌపూజ్యత కల్లు చునే యుండెను.” యాదవ ప్రళయమునకు సురాపానమే మూల "కారణము. విప్రముఖంబుననే విద్య ప్రవర్తిల్లవలయునను .

..............................................................................................................................

35

  1. పొండవజననము, దృత రాష్ట్ర పాండురాజుల జన్మము; ఆత్మకుని జన్మము, ఆంగ రాజు జనసము - భారతము