పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృత యుగము


స్త్రీలకు సంసార సంబంధములుకూడ నామసూత్రముగ నున్నవి. “ఇల్లాలు, మగనాలు' అను. మాటలయర్ధము నాఁ' సతీమణులకు బోధపడుట దుస్తరము. శుల్కములు లేపు, గధర్వులు, కిన్నరులు, కింపురుషులు మొదలగువా రందర దేవ యోనులఁట. అనఁగా ఆంగ్లకవి శేఖరుఁడగు బెర్నాడ్ షా” కవి కల్పితుఁడయిన అతీతమానవుఁడు -Super Man• తత్కారణంబున వారి చరిత్రలను జర్చీంచి భారత ధర్మనిర్ణయముఁ జేయుట సమంజనము కాదేమో! కాని నాఁటి హింద్వార్యులకు వారివర్తనమే వారి శీలవృత్తమువలె యాదర్శప్రాయముగా నుండెను. అందుచేత నే నేఁడు మనము కేవలము జారత్వముగా నెంచుచున్న గాంధర్వవివాహము గంధర్వులచే సనలంబింపఁబడియుండుట చేతనే '[1]పవిత్రతఁగాంచి నది. కులముంబట్టి విద్యానిషేధము లేదు. మానవుని ప్రకృతినిఁ బట్టి తన్నిషేధము కల్గుచుండెడిది. జనులు సత్యశీలురు. అబద్ద మాడుట యెరుంగ రేమో! ధర్మసంస్థాపనార్థమై గురువుల తోడి పోరాటము బాహాటము. విధవలనుటయే యెఱుంగము, ఆతి బాల్య వివాహములకు నుపప త్తియే లేదు. [2]* కుటుంబ జంబాలమున్నట్టు లూహింపఁజాలము, స్వైరవిహారము మెండు, ఉరత్వముచే సంతానము కల్గినను తాళిగట్టిన మగఁ డేనపడుట కానము, దేవగురువైన బృహస్పతిభార్య, తార, పరపురుషుఁ డును, భర్త చాత్రుఁడునైన చంద్రునితోఁగవగూడి గర్భిణియై


1 *


31

  1. సత్య కామ జాబాలి చరిత్రము,
  2. సంధ్యాదేవి జననము, -