పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యు గ ము లు


సంతకన్న ను లొచ్చై హీనమాసవ సంవాసితమై యున్నవి. పురాణములు చెప్పు మాటలు నిజములే యగు నెడల నన్ని దేశములయందును నొక్క కాలమున నొక్కవిధమగు నాగరి కతయే, యనఁగా నొక్కవిధమగు ధర్మావలంబసమే లోచన గోచరము కావలసియుండును. భిన్న దేశముల యందొక్క "కాలముననే, భిన్న నీతి ప్రవర్తిల్లుచుండవచ్చు నందురా ! అది మా వాదమునే స్థిరపఱచును. పురాణము లొక్క భారత దేశమునుగూర్చియే వక్కాణించెనందురా ? అట్టిది • కాన రాదు: మ్లేచ్ఛ దేశములనుగూర్చికూడ నీతులు, ధర్మములు బోధింపఁబడినవి. కావున కృతయుగమునుండీ క్రమక్రమ ముగాఁ జల్లఁగా కలియుగము వచ్చుననుట విస్రంభపాత్రము గఁదోఁపదు. పాఠక మహాశయా! కొన్ని యంశములను ముందు చర్చింతుము. సావధానముగా సాలింపుము.


బంగరుముద్ద నెగర వేసికొనుచు నటవీమాంబునఁ బోవుచున్నను జోరభీతి కల్గింపన ట్టియు, దాసపూర్వకముగా, మతవివక్షత లేక బండారముననున్న ద్రవిణమునంతయు వెచ్చించి పండితపవరులఁ దనియించి యశఃకాయుఁ డైన హర్షవర్ధనునిచేఁ బరిపాలింపఁబడినట్టయు, పూజ్య రాజ్యము, అన్నదమ్ముల పాళ్లు తెగక, రాజ్యకాంక్షచే నొకరి కుత్తుక లొకరు తెగనరికికొని చచ్చిన 'పాండవ రాజ్యమునకన్నను, భగవద్ధ్యానముఁ జేసికొనుచుఁ గాలక్షేపముఁ జేయు నిరపరాధుని వంక బెట్టి చంపిన రామరాజ్యము కన్నను నుత్కృష్టము

27