పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు


అతి ప్రాచీన కాలముందొట్టి యిందనుక భారతవర్షంబున సనన్య సామాన్య ప్రతిభావభావంబున సర్వప్రపంచమును గబళింపఁజాలు పజ్ఞాచక్షువులున్నను, విద్య, పాకృతజసదుర్లభ మగుటం జేసి, భారతలోకం బజ్ఞానగాడాంధకారబంధురముగా నుండె. ఏతత్కారణంబున నక్ష రాస్యులకు మిక్కుటమగు గౌరవము చేకూరియుండెను, వారు చెప్పినదే మాట, వారు పాడిన దే పొట యయ్యెను. నాల్గు మాటలు నేర్చిన జూల్ముం డై నను జనసామాన్యముచేఁ బూజనీయుఁడుగా నెంచఁబడు చుండెను. సంస్కృతము కవి భాష యగుటచేతను,బ్రజలకు దురవగాహ మగుటచేతను, దద్భాషయం 'దేమీ చెప్పఁబడినను సయ్యది యతిపవిత్రతఁగాంచెను. చిలుకలవ లే నాల్గుసంస్కృత శ్లోకములు పఠింపఁ జూలినవాఁ డత్యధిక మాననీయుఁడయ్యెను. ఈ విధముగ విద్యలోకమునుండి కాలక్రమంబున నాచార్య పరంపర బయలువెడలెను, తోలుదొల్త నీ యాచార్యకము వ్యక్తిగతమై, తుదకుఁ దచ్ఛిష్యపరంపరా వశమై యుండెను, వదపడి కొండొక కాలంబునకుఁ గులాధీన మయినది. ఆచార్య త్యము వ్యక్తిగత మైనప్పుడు, విశేష ప్రజా ధురంధరులు గురు పీఠము నలంకరించిరి. కులక్రమాగత మైనయప్పుడు ప్రాజు లాచార్య పీఠమునకు దూరగులైరి. దూరగులగుటయే కాక, మీదుమిక్కిలి, రానురాను బహిష్కృతులయిరి,, ఆచార్యత్వ


23