పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీక్షిణా పథము


కును వివాహములు సంపూర్ణముగా నిషేధింపఁబడినట్టు తోచదు. మునివర్యుఁడయిన వసిష్ఠుడు, చండాలినియైన యక్షమాలను వివాహమాఁడెను. ఈ వివాహ మార్యజన దూషితము కాలేదు. ఇట్టి వివాహముల చేతనే వర్ణ భేద మేర్పడుచుండును. అమెరికా దేశమునందు 'అమెరికను నీగ్రో' యనులోమ విలోమ వివాహప్రతిఫలముగా సిట్టి వర్ణ భేదముగల మానవులు పెక్కురు దృష్టింబడుచుందురు. ద్రావిడుఁ డార్యస్త్రీతో వ్యభిచరించిన యెడల విధింపఁబడు శిక్ష ప్రాజ్ఞులోకమునకుఁ గంపము గల్గింపక మానదు. ఆర్య ద్రావిడులు సమాన నింద్యులయినప్పుడు విధింపఁబడెడి శిక్ష యందుఁ దారతమ్యము చాలఁగలదు. ఋషులనుగూడ జాత్య హంకారము, జాతి వైరము ధర్మదూరగులను జేయుట సంతాప కరము. మూడు నాలుగు వేల సంవత్సరములనాం డార్యా వర్తమునఁ బ్రదర్శింపఁబడ్డ నాటక మే యీనాఁడు దేశమున" బ్రదర్శింపబడుచున్నది. నాటి యార్యావర్తము నేటి యమెరికా యైనది. మూఁడు నాలుగువేల సంవత్సర ములు కడచన్నను నార్యమం త్రాంగమునం దేమాత్రము మార్పు గానరాదు. హింద్వార్యుల స్మృతులను పరీక్షించి, ఆమెరికనులు నీగ్రోలయెడఁ జూపు దుస్సహ ప్రవర్తనమును బరిశీలించిన యెడల నేమాత్ర భేదము గన్పట్టక యచ్చున గ్రుద్దినట్లుండును; దేశకాలపాత్రముల వలనఁ గల్గిన వచ్ఛేదము మాత్రమే లోచనగోచరమగును. ఆర్యావర్తమున


18