పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీక్షిణా పథము


జరిపిరి. ముని తండ్రి నిఁబట్ బ్రాహ్మణుఁడయ్యెను. నాడు నేడు వోలె క్షేత్ర ప్రధానముగాక బీజప్రధానముగా నుండె, పెండ్లి పేరంటము లేని ఋషులు పెక్కురు ఇంగ్లీషు భాషలోని లోకోక్తి బోలె Sowing of wild oats నిరాఘాటముగ ఇందుచేతనే పెళ్కినాంతర జాతు లేర్పడుటకు వీరు గారణభూతులైరి.

ద్రావిడులు కొలాంగులు


ఆర్యులచే నోడింపఁబడిన దావిడులకు బానిసతనము తక్క వేరే యిస్తువు లేకపోయినది. పరువు ప్రతిష్టలు మటు మాయమయ్యెను. ఆర్యులు మహాహంకారములో ద్రావి డులతోఁ బొత్తు నిచ్చగింపక, మిగుల దీరస్కారమును జూపిం చిరి. చెప్పరాని కట్టుదిట్టను లేర్పఱచి దావిడులను దూర దూరముగా నుంచిరి. కట్టుదిట్టముల దాటి యేర్పడ్డ' వివాహ ముల వలనఁ గల్గిన సంతానమును, హీనజాతులను కొన్నింటి సృష్టించి, వానిలోనికిం ద్రోసిపుచ్చిరి. ఈ జాతులకు సుగ తులు లేవని చెప్పిరి. ఇది యార్యావర్తనమునందలి కథ,

దక్షిణాపథము

దక్షిణాపథమున వైశ్యులనఁబడు కోమటు లెన్నఁడు కర్ష కులుగాఁగాని గోపకులుగాఁగాని లేరు. ఎన్నఁడు పీతపర్ణులుగా గూడ నున్నట్టు . కన్పట్టదు. 'నేలమ, కమ్మ, రెడ్డి మొదలగు



15