పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలిపలుకులు


ఇది యిటులుండ నార్యులయందలి మూఁడు వర్ణముల వారికి స్వత్వములయందు నీషద్వ్య త్యాసమైనను గల్గుటకు కారణ మేమియో యోజింతము, దీనిని బరిపూర్ణముగా గ్రహించుటకు మూలసూత్ర మొక్కటియున్న ది. యేదంటి రేని, విపరించెద మాలింపుఁడు. స్మృతిక ర్తలు పెద్దలు నీ మూఁడు భాగములయందలి మానవులకు శరీరపర్ణము (ఆనఁగా నొడలిరంగు) మూఁడు రకములుగ నుండునని వాకొనిరి. ఒక్క జాతీయం దే దేహచ్ఛాయయందు నీ భేదము కల్గుటకుఁ గారణమేమి ! నిజముగ నాయా భాగముల వార లాయా వర్ణములఁ గలిగియే యున్నారా ? దీనికిని జాతివిభా గమునకును, స్వత్వనిర్ణయమునకును, సంబంధ మేముయిన నున్నదా ? మీమాంసఁ జేసి పరిశీలింతము.


మా యభిప్రాయమున నాయా విభాగములకుఁ జెప్పఁ బడిన దేహచ్ఛాయకును, స్వత్వ నిర్ణయ మునకును గావలసినంత సంబంధమున్నది. శీతోష్ణ పరిస్థితులవల్ల దేహచ్ఛాయ మారు ననుట యెల్ల 'రేరిగినది యే. అతిశీతల దేశవాసులు తెల్లగను, సత్యుష్ణ దేశ వాసులు నల్లగనుందురు. ఈ కారణముచే శీతల దేశ వాసులగు నార్యులు తెల్లగను, సుష్ణ దేశ వాసులగు ద్రావిడులు నల్లగనుండిరి. ఇందు సృష్టి వైచిత్ర్యమేమియు లేదు. హిమాలయోపరిభాగమందున్న కైలాసమందు వసిం చిన శివుఁడు తెల్లనివాడని పురాణములయందు వర్ణింప


11