పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు



లెవ్వరు ? శాఖోపశాఖా సమన్వితమయిన ద్రావిడలోకంబు నకుఁ జెందినవారు. వీరార్య జై త్రయాత్రకుఁ బూర్వమునుండి యీ దేశంబున వసించుచున్న వారు. విదేశీయులు, విజాతీయు లయిన యార్యులు తమ దేశంబునకు వలసవచ్చినపుడు, మోహ రించి, యొడ్డారంబులొడ్డి యొఱగడ్డములందొక్కి, పెక్కు శతాబ్దులు హోరాహోరిం బోరి, పోరి, యార్యుల తెక్కలి త్రోవలను సరికట్ట నడుముకట్టి వసుంధరాభాగమును, గవోష్ణ రక్తధారాసరిఫ్లతమును జేసిన మహావీరులు. దైవోపహతు లయి వడ్డరులగు నార్యుల కుతంత్రంబులకును, సవినీతికిం జిక్కి షరాభూతులయి వీరు త్తరాపథమునుం.. వెనుకకు మరల వలసినవారైరి. వెనుదిరిగిన ద్రావిడలోకంబు నందలి క్షత గాత్రులను, వికలాంగులను, బందీలుగాఁబట్టి యార్యులు వార లను బానిసీండ్రను జేసికొనిరి; లోఁబడిన ద్రావిచులను గట్టు దిట్టములలో నుంచి, యెన్నఁ డెట్టి తిరుగుబాటు జరుగకుండు టకునై, ' స్మృతులు రచియించి, వీరికి ధర్మోపదేశంబుఁ గావించిరి. సర్వస్వత్వములకు దూరగులం జేసి, కొంచెమించు మించుగా సంఘ బహిష్కృతులనుగాఁ జేసిరి. వీరికిఁ డ్రైవర్ణిక శుశ్రూష యే విధివిహితమనిరి. ఇస్తువును గడించుటకు హక్కు లేదనిరి. గడించిన యిస్తు వేదయిన నున్న యెడల బ్రాహ్మణుల పరము: గావింపమనిరి. వీరికడ ధనమున్న యెడల రాజు బలా క్కారముగా సైన లాగికొనుట ధర్మమగిరి. ఇవియుత్తరాపథ మున నున్న ద్రావిడుల స్థితిగతులు,

10