పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు.



“ఆర్య స్త్రైవర్ణికః” యని పూర్వులు నిరాఘాటంబుగ వాకొనియున్నారు. దీని యర్థ మేమి ! ద్విజులని నేఁడు వ్యవహ రింపఁబడుచున్న మూఁడుకులములవారేయార్య లోకంబునకుఁ చెందిన వారని పూర్వుల యభిప్రాయము. అయినచో శూద్రు లని కలగూరగంపగా వర్తమాసంబున వ్యవహరింపఁబడుచున్న నాల్గవ జాతివారి యుపప త్తి యేమి ? ఎవ్వరువీరు ? చిర కాలము నుండి సామాన్య స్వత్వదూరులయి వీరు నీచదశం బొరలాడు టకుఁ గారణ మేమి ? స్మృతులయందుఁ జెప్పఁబడిన వీరి జన్మ కథనము నిజమయిన దేనా ? నిజముగ స్మృతులు వీరికొనంగిన స్థానమేనా వ్యావహారిక మునందుఁ జెల్లినది, చెల్లుచుండినది ? స్మృతివాక్యములకు నాబారమునకు భేద మెట్లు తటస్థించినది ? స్మార్త ధర్మవిరుద్ధముగ దక్షిణాపథమున వీరికిఁ బ్రజాపాలనము, సేనాపతిత్వము, మంత్రిత్వ మెట్లు లభించినది ? ఈ యంశ ముల నన్నింటిని గూలంకషముగను, నిప్పాక్షికముగను, సని తర్కముగను జర్చించుట మా విధియని నమ్మి యిప్పుడద్దాని కుపక్రమించుచుంటిమి.


ఉపర్యు దాహృతమగు లోకో క్తినిబట్టి శూద్రశబ్ద వాచ్యులయిన మానవులు 'ఆర్యులు' కాక 'అనార్యులని మాత్రము స్పష్టముగఁ దేలుచున్న ది. అయినచో నీయనార్యు

9