పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ప్రాచీనాచారములు స
మీచీనము గాదటంచు మిక్కిలి కినుకన్
వాచాలత్వముతో బూ
ర్వాచారంబులఁ ద్యజించి రార్యానుచరుల్ .


భేదభావంబు లీరీతి విస్తరించి
యార్యకింకరు లధిక గర్వాడ్యులగుచు
మచ్చరం బంతకంతకుఁ బెచ్చు పెరుఁగ
ను విడి వేరుశాఖయైయుండి పిదప.


ద్రావిడ ప్రజావళి యెల్లఁ దమకుఁ గైవ
సంబు కాకపోయెనను క్రోధంబుచేతఁ
గలియుగంబునఁ బరికింపఁ గలవు రెండె
వర్ణము లటంచు నార్యులు నిర్ణయించి.



బ్రాహ్మణులును శూద్రులును మాత్రంబె కలరు
క్షత్రియులు వైశ్యులును లేరు కలియుగమ్ము
నందు నంచు సిద్ధాంతవాక్యములు వ్రాసి
పెట్టిపోయిరి స్మృతులు ద్రావిడులకొఱకు.


మాయావాదము నిల్వదు
మాయావుల మంత్ర తంత్ర మహిమం బిదిగో !
పాయఁగఁజొచ్చెను మాయో
సాయము లేన్నటికి నైన బయలం బడవే !

85