పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ఉత్తరంబున నార్యు లుద్వృత్తినపుడు
చతురుపాయంబులఁ బ్రయోగచతురులగుచు
శత్రుకాండీరులను నెల్ల సదమదించి
దక్షిణాపథమ్ము జయింపఁ దలఁచి తలంచి.


సర్వతంత్ర స్వతంత్రుండు శ్రద్ధదానుఁ
డింగితజ్ఞుండు వేద వేదాంగ వేది
యగు నగస్త్యుని బిలిపించి యప్పుడవు డే
చెప్పిరిటు పల్కు నయగార మొప్పుచుండ



తెక్కలి నిన్న మొన్న పర దేశమునుండి బిరాసవచ్చినా
మెక్కడఁజూచినన్ రిపు ల దేపనిగా మనచుట్టుమూఁగి తా
ముక్కడగింపనుండి రెటులో యొక దారిని నుత్తరాదినిన్
గక్కన పెట్టి వైరులను గాపురముంటిమి కత్తి బల్మిచే,


మనచే నోడింపఁబడిన
మన వైరులు దక్షిణమున మసలుచునుండన్
మన కబ్బఁగలదే క్షేమము
మనఁగల మే చిక్కు లేక మనమిచ్చోటన్ .


శత్రు పరి శేష మెటువంటి సాహసునకుఁ
బ్రాణహానికరంబని రాజనీతి
కోవిదులు పల్కుచుందురు గునియకుండఁ
గాన మనమది పాటింపఁ గర్జమౌను


79