Jump to content

పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము



వింధ్యదక్షిణ భాగవిశ్వంభరను నొక్క
               గొడుగు క్రిందికిఁ దెచ్చి విడిచినారు
కాకిచే గబురంపి కప్పముల్ చెప్పించి
                 కొని నైరి కభయంబుఁ గూర్చినారు
దాసధర్మంశ్రేణి యూనంబుగాకుండ
                   బండారముల వేల్తిపఱచినారు
దండెత్తివచ్చిన మండ లేశుల నెల్లఁ
                   బూరిమే సెడిదాఁకఁ బొడిచినారు.


సరిగఁ బాలించి దుష్టశిక్షణము శిష్ట
రక్షణముఁ జేసిరి ప్రజానురంజకముగ
రాజమాత్రులే ద్రవిడ ప్రభువు లెల్ల
నిఖలలో కైక కల్యాణ నిలయు లైరి


క్రమముగా వంశ పారంపర్యముగవచ్చు
               నాచారములను గాపాడినారు
ఉత్సన్న దశ బొందకుండ నెల్లప్పుడు
             శృంగారకళలఁ బోషించినారు
కాటకంబుల నెల్ల బూటకంబులుచేసి
                సీమన్నిం'టి రక్షించినారు.
దొంగ దొడ్డడికాండ్రఁ దూలించి రాష్ట్రంబు
               లేద్దడి లేకుండ దిద్దినారు

74