పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


పంటకాల్వ లయ్యెను గొండవాగు లెల్ల
బంటపొలము లయ్యెను జౌటిపడీయ లెల్ల:
బంట పై రులు తలయెత్తె గంటలోనఁ
బంటకాపు చల్లనిచేయి పడినమాత్ర

.
దక్షిణ దిగ్భాగమున సు
శిక్షితులై ద్రావిడకుల శేఖరతతి ధ
ర్మక్షయ మెది లేకుండ
రక్షింపుచు బీదసాద రైతుల నెల్లన్.


రాజ్యములం గడించి సమరస్థలి శత్రులఁ బిల్కు మార్చి త
ద్రాజ్యములన్ హరించకయె రాజ్యములన్ దొలిరాజులేలసా
మ్రాజ్య పదాధి రూఢులయి ద్రావిడ భూపతివర్గ మెంతయో
ప్రాజ్యముగా గ నేలి జనరంజనఁజేసెను దక్షిణంబునన్


 .
బూవము బంతి పెట్టి రివు భూభుజ సంతతికిస్ సరస్వతీ
దేవికి నాట్యరంగముగ దేశమునుం బొనరించి లక్ష్మికిన్
స్థావర మొక్క టేర్పఱచి చక్కఁగ సర్వక కుబ్వికీర్ణ తే
జోవిభవంబు చేతఁ బరిశుద్ధులు సిద్ధులు నైరి భూవరుల్ .


భారత యుద్ధమందుఁ గురుపాండవ సైన్యము రాజ్య కాంక్ష చే
బోరఁగ నిల్వగా సమరభూమి పరాజిత వై రివీర పృ
థ్వీరమణుండు పాండ్యుఁ డతిధీరుఁడు ద్రావిడ భూమిభర్త శూ
రారికులంబు నెల్లఁ దెగటార్పఁడె ధర్మజ పక్ష పాతియై.


73