పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


ఎదురు చెప్పఁగ నేర్చువా 'రెదుట లేమి
బెదరు నదురు లేకుండద్రావిడులఁగూర్చి
నీచ వాక్యంబులను వ్రాయ నేర్చినారు
బడుగు పెద్దలు గంటంబు పదనుచెడఁగ.


కారియలందఁగా బురుషకారము వ్యర్థమయైన ధైర్యమున్?
జారఁగనీక ద్రావిడులు సాధుమృగంబులపోల్కి నెట్టి ధి
క్కారమునైన నెట్టి యపకారమునైన సహించి నీరసా
కారముతోడ నుండిరి వికారము లేకిటు లుత్తరంరంబునన్ ,


భగ్నమనోరథులై యు
ద్విగ్న మనస్కులయి ద్రవిడ వీరవ రేణ్యుల్
భుగ్నులయి దాస్యపంకని
మగ్ను లగుచు నుండిరి యవమానక్షములై ..


మంచికాలంబునకు వేచి పొంచి పొంచి
యూర్య మందిరంబులయందు నణఁగి మణగి
చివికిపోయిన మనసుతో నవసి ననసి
యుత్తరాదిని ద్రావిడు లున్నయంత.


దక్షిణభూమికిం జనిన ద్రావిడు అద్భుత శక్తిమంతులై
దీక్ష వహించి దానిని స్వదేశముగాఁ దలపోసి దక్షులై
యాక్షితి నిండ్లు గట్టుకొని యందె వసించి క్రమక్రమంబుగా
నక్షయమైన వైభవము నందిరి వందురు మాని యందరున్ ,

72