పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా మ స్వామి గారు


పాతపురాణాలు తాను చెప్పినవిగావని సూతుడే చెప్పాడట. “నామెడకు అంటగట్టారు' అని చెప్పి యదార్థధర్మాలు చెప్పాడు. ప్రజల్లో గొంత-చైతన్యం: అక్కడక్కడ ఏకలవ్యులు బయలు దేరటం. ఏవూరికి ఆ వూరిలోనే ప్రశ్నలు జవాబులూ,


ఆంధ్రమహాసభలో కవిరాజు బిరుదు. ఈ సంగతి ఎవ్వరో వచ్చి చెప్పారు. “ఓహో, అన్నారు రామస్వామిగారు.


సూతపురాణ ప్రచురణతో అగ్రజాతిలో ఆగ్రహం మరీయెక్కువైంది. ఒక్క వుదాహరణ ! ఒక 'వాల్మీకికి ఒక శాస్త్రీ, సూతపురాణాలిచ్చాడు_"ఎవరివి ? అని 'వాల్మీకి అడిగాడు. రామస్వామిగారివి.” “ఆ నా స్తికుడివా ! ఆ నాస్తికుడివా !!' అని ఆ పుస్తకాలు లాక్కుని ముక్కలు ముక్క-లుగా చించి తగలబెట్టారు. ఈ సంగతీవిని రామస్వామి గారి జవాబు' అందరూ నా పుస్తకాలు కొని, ఈ విధంగా చేసినా బాగుండు." ఖూనీప్రకటన: ఆర్యఋషులకు తమ నిరంకుశత్వాన్ని నిలబెట్టుకోటానికి స్వర్గం నొక వంక...సంఘాభి వృద్ధికీ, భగవంతుడు ఆటంకం--- లోకం నాస్తీక మయం కావాలి తమ అధికారానికి ఆటంకమయి తే హత్య చెయ్యటానికి ఆర్య ఋషులు వెనుదీయరు !!


తంజావూరు జస్టిస్ పార్టీసభకు బొబ్బిరాజాకు వ్యతిరే కంగా అధ్యకత. అప్పుడు మునుస్వామి నాయుడుగారు


19