పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము


తమజాతిలోసం గలిసిన
దమవర్ణము మాసిపోవుఁ దప్పక యనుచుఁన్
దమకక ద్రావికజనులను
దమజాతిని జేర్పరైరి తగనని దూర్యుల్ ,


దావిడులలోనఁ బెద్దల
రావించి మరొక్క నాడు రచ్చకు దగు మై
నీవిధము వసిష్ఠుడనియెఁ
దీవరమును మాటుపుచ్చి తీయని నుడులన్ .


మీకున్న యింటి పేరులు
కోకొల్ల వినుటకు సొంపుఁ గూర్పవు పై గా
మాకు జ్ఞాపకముండవు
మీకిత్తుము మంచి పేరు మేమొకటనుచున్


పగఱయింటి వరవడంబు పలసం గల్గు
దైహికము మానసిక మైన దారుణర్తి
బ్రుంగుచుండుటఁ దలపోసి క్రొవ్వు చేత
శూద్రులను పేసు పెట్టిరి శుద్ధశకుఠులు,



బొత్తిగఁ దార్ల్మి లేక పొర పొచ్చము లెవ్వి.యు పస లేక య
త్యుత్తమజాతి సంజనితు లుండిరి ద్రావిడ సంఘమందు నాఁ
జిత్తమునందు నొక్కుడు చింతిలకుండఁగ చూశూద్రులంచు దు
ర్వృత్తి నిమగ్నులై వ్యవహరించిరి దూరముఁజూడకుండగన్ .


66