పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము



వీఁగిన ద్రావిడ సైన్యము
బాగుగ వీక్షించి యార్యవాహిను లెంతో
వేగమ కెన్నా డెను నీ
యాగముఁ బరికించి దేశమంతయు బెదరన్,


పిల్లలు ప్రొదెల్లంగలసి
యల్లో నే రేళ్ళనాడి యరి గెడి బాతిన్
జెల్లాచెదరై ద్రావిడు
లల్లారిరి చెట్టుకొక్క రై యడవులలో,


ఒంజలి చేత ద్రావిడులు యుద్ధము మాని విషాదచిత్తులై
వింజముదాఁటి కారు టడవి దల దాచుకోనంగఁబొచ్చుచున్
సంజుల దొంగదాగులను జాటున మాటున దక్షిణాశకున్
గొంజక క్రొత్తనాడికలకుం జని నిల్చిరి యచ్చటచ్చటన్


చెంచులుమాత్రము వింజపు
టంచుల విడిపోవలేక యటనే తము బో
షించుకొనుచు డాగిరయో!
పెంచిన దేశంబు విడచి పెట్టఁగఁ దలమే?


మాస్యతర మైన దేశాభిమానగరిమ
పచ్చినెత్తురుఁ ద్రా వెడి ఫగఱనడుమ
నుసురు లఱచేత నిడికొని మసలుచుండు
చెంచువారలఁజూచి గ్రహించవల

యు,


62