పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


అంతకుమున్నే రిపు వృ
త్తాంత మేరిగి యార్యులు బహు దర్పముతో ని
శ్చింత మెయిన్ సాయుధులై
పంతముతో వచ్చినారు బవరము "సేయన్



ఒంటరు లై సరిసరులై
బంటులు చెల రేఁగి యుభయ పక్షములందున్
ఇంటింపఁబడుచు గెంటుచు
బంటింపక వార'నేక భంగులఁ బోరన్.


గండరగండ లై పిరికి కండ యొకించుక లేక చండదో
రండగదాప్రహారముల దండు పయింబడి పోరుచుండఁగా
నేండులు పూందులున్ గడ చెనింతియకాని జయంబుమాత్రమున్
రెండుకుదుళ్ళ వారిని వరింపకపోయె నింకేమి చెప్పెదన్



అంత భటులెల్ల జర్టరితాంగులగుచుఁ
గాందిశీకులై తాత్కాలికంబు గాఁగ
గలను జాలించి రంతియేకాని పిదప
బెసఁగులాటను క్షణ మైన వీడ రైరి.



ఓహరి సాహరి పెనఁగియు
మోహరములుదీర్చి యుద్ధభూమి వడంకన్
బాహా బాహిని బోరియు
నోహటి లెను ద్రావిడ సుభటోత్కర మెల్లన్ .


61