పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము



యెల్లకాలంబు పోషించె నింతదనుక
‘‘నడుగనిదే యన్నమునుబెట్ట దమ్మ"యైన
ననెడి సామెత వ్యర్థమై చనఁగ నిట్టి
మాతృదేశంబు మనమెట్టు మఱవవచ్చు !


కూళలురేఁగి యీకరణిఁ గూడని కార్యము లాచరించుచుౝ
బాలలు బాలురున్ బెదరి పాఱఁగ బొబ్బలు పెట్టిపెట్టి గ
గ్గోలొనరించి దేశమును కొద్దియొ గొప్పయె యాక్రమింప నీ
పోలిక నూరకుంట మనబోంట్లకు ధర్మమె ! రాజకర్మమే


నదురు బెదురు లేని నాయంకులెందరో
సొంత నాడు కొఱకు వంతదక్కి
వ్రేటుపడ్డపులుల విధముగాఁ బోరాడ
నేర్చువారు కలరు నిశ్చయముగ.

ఇప్పుడే మనమెల్లరమును
జప్పుడుగాకుండ వైరి సైన్యముమీఁదౝ
గుప్పించి దూఁకి పొడుచుట
దప్పని షని వేఱెలేదు ధర్మంబన్నన్ .

అంపకోలలు పొదినుండి యవలఁబడెను
పదనుచురకత్తు లొరనుండి బయటఁబడెను
మన్ను మిన్నును గానక మన్నెదొరలు
సింగినాద మూఁదుచుఁ గూచి సేసి యపుడు.

59