పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


వేసిన పైరెల్ల మోసులెత్తకమున్నె
సంగోరు తినివేసె జట్టిమిడుత
ఏఁడాది పొడవున నివశింపఁగ భూమి
విడివడ్డ సాబాలు సుడిసిపోయె

ముక్కారు పంటలు మక్కిపోనఁగ నిట్లు
పట్టెడు కలియైనఁ బుట్టదయ్యే
వలిచుట్టు పెట్టంగ నగండ్ల కడగండ్ల
గడుపు కక్కూర్తియుఁ గడవదయ్యె


బ్రజల కన్న పానీయముల్ పట్టిపోయె
గంటికిని గూర్కు కఱవయ్యె గానికాల
మరుగు దేరంగఁ గటకటా! యమరపురిని
దుర్భరంబైన దుర్భిక్ష తొడరినపుడు


కాపులు పడిగావు లగుచుఁ
గూ పెట్టుచు రేని కొలువుకూటముఁ జొరఁగా
నేపనికై వచ్చితిరని
కాపులఁ బ్రశ్నింపఁ డెంత గామిడి యతఁడో,


ఎత్తికోళ్ళకు కనికరం బెనయ లేదు
మొత్తుకోళ్ళకు మది జాలిఁ బొంద లేదు
వేడికోళ్ళకు దయ యుద్భవింప లేదు
ముజ్జగంబుల దొర యెంత ములుచవాఁడొ.


51