పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ఆటమటీండ్రును దుండగీద్రా చరించు
ధర్మపీడలు రప్పించి ధర్మపరుఁ
బ్రోచువారు గావున నై రి పుణ్యపురుషు
లనుచు నారదుం జాడినయంత నేను.


తెల్లంబోయి పౌరాణిక గాధలందు రాక్షసులం గూర్చి
కరతోరంబులగు కథలు కలపని యెట్లన్న -


క్రూర సమీకరంగమునంగూడి చలంబు దేవ దానవుల్
పోర జయాభిలాషులయి పోయి పరాజితులైరి దైత్యు ల
వ్వారినిగూర్చి దేవతలు వారక వ్రాసిరబద్ధసంగతుల్
గారడి చేయ లేని యొక కావ్యము కల్గునె లోకమందుసన్


గెల్పోటముల నొక్క పో ల్పునఁ జూచిన
వృత్రాసురుఁడు తత్వవేత్త కాఁడె
రణనీతిబద్ధుఁడై ప్రాణముల్ నాసిస
స్వర్ణ నేత్రుఁడు నీతిశాలికాడె?

కాపట్య మెరిగియుఁ గాశ్యపి నిచ్చిన
బలి దైత్యుఁడు వదాస్యవరుఁడు కాడె ?
సమధీత "వేదవిజ్ఞానధనుండైన
విశ్వరూపుడు వేదవేత్త కాఁడె?

49